*ముఖ్య కార్యకర్తలు అలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు, అధిష్టానందే బాధ్యత….*
అమరావతి:
రాష్ట్ర మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సంస్థాగత రూపురేఖల్ని త్వరలో మార్చబోతున్నట్లు, గతంలో తెలుగుదేశం పార్టీ సంస్థగతంగా వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనని, దాన్ని సమూలంగా మార్చే దిశగా నారా లోకేష్ చర్యలు చేపడుతున్నట్లు శ్రీధర్ తెలియజేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్థగతంగా కొన్ని లోపాలు సరిదిద్దుకునే ప్రక్రియను నారా లోకేష్ చేపడుతున్నట్లు, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమూలమైన మార్పులు త్వరలో మనం చూడబోతున్నట్లు, రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో వివిధ నియోజకవర్గాల్లో ముక్కు మొహం తెలియని వ్యక్తులు కూడా రాష్ట్ర నాయకులుగా పెత్తనం చేసే విధానాన్ని కూడా మార్చబోతున్నట్లు ఎవరైతే బూత్ స్థాయిలో పనిచేస్తారు వారికే సీనియార్టీ ప్రకారం రాష్ట్రస్థాయి పార్టీ కమిటీల్లో పదవులు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించే విధానం శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న సరే ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నారని, ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో శాసనసభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు కూడా కార్యకర్తలుగా మారాలని, ప్రధాన నాయకులు కూడా ఏసీ గదులు వీడి సంక్షేమ ఫలాలను, పథకాలను ప్రజలకు ప్రచారం ద్వారా చేరువ చేయాలని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలు అలగ కుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు, అధిష్టానందేనిని శ్రీధర్ తెలియజేశారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





