వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానుష ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో మహిళను బంధించి, దారుణంగా వేధించారు. బాధితుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళనకరంగా మారింది. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..
ఆటవికం, అమానుషం.. ఈ ఘటన గురించి ఏం చెప్పాలి.. అజ్ణానంతో పశువుల కంటే దారుణంగా ప్రవర్తించారు. ఒక వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో.. కొందరు ఆమెను బంధించి, వివస్త్రను చేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఆమె జననాంగాల్లో జీడి పొడి పోసి పాశవికంగా వ్యవహిరించారు. బాధితురాలు ఎంత వేడుకున్నా వారు వినలేదు. ఆపై ఆమెతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్న వ్యక్తికి అరగుండు కొట్టారు. మాటల్లో చెప్పలేనట్లుగా ప్రవర్తించారు నిందితులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. తన భర్త ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని రాజు భార్య కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో భార్య తరపు బంధువులు రాజు, సదరు మహిళను దొరకబట్టి అమానవీయంగా దాడిచేశారు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు.
తప్పు చేశారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? మీరే దాడి చేసి పనిష్మెంట్ ఇస్తారా అంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఘటనపై సీరియస్ అయ్యారు పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read
- మచిలీపట్నంలో దారుణం.. కోటి రూపాయల వివాదం నేపథ్యంలో వ్యక్తిపై కత్తి దాడి
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. పోలీసుల అదుపులో సీఐ నాగరాజు స్నేహితుడు
- చుట్టాలే కదాని గుడ్డిగా నమ్మి రూ.21 లక్షలు ఇచ్చింది.. తీరా తిరిగిమ్మని అడ్డగ్గా.. ఇది పరిస్థితి
- బట్టతల, తిప్పి కొడితే 5 అడుగులు.. 40 మంది మహిళల్ని ఎలా మోసం చేశావురా..
- ఐదు వివాహాలతో బురిడీ.. నిత్య పెళ్లికూతురు అరెస్టు





