SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఆటవికం, అమానుషం – ఇంతకంటే దారుణం ఉంటుందా..? మహిళను చెట్టుకు కట్టేసి..



వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానుష ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఆరోపణలతో మహిళను బంధించి, దారుణంగా వేధించారు. బాధితుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళనకరంగా మారింది. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..


ఆటవికం, అమానుషం.. ఈ ఘటన గురించి ఏం చెప్పాలి.. అజ్ణానంతో పశువుల కంటే దారుణంగా ప్రవర్తించారు. ఒక వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో.. కొందరు ఆమెను బంధించి, వివస్త్రను చేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఆమె జననాంగాల్లో జీడి పొడి పోసి పాశవికంగా వ్యవహిరించారు. బాధితురాలు ఎంత వేడుకున్నా వారు వినలేదు. ఆపై ఆమెతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్న వ్యక్తికి అరగుండు కొట్టారు. మాటల్లో చెప్పలేనట్లుగా ప్రవర్తించారు నిందితులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. తన భర్త ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని రాజు భార్య కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో భార్య తరపు బంధువులు రాజు, సదరు మహిళను దొరకబట్టి అమానవీయంగా దాడిచేశారు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు.

తప్పు చేశారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? మీరే దాడి చేసి పనిష్మెంట్ ఇస్తారా అంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ ఘటనపై సీరియస్ అయ్యారు పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also read

Related posts

Share this