ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ తరువాత జరిగిన పరిణామాలపై సురేష్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు.
పరారీలో ఉన్న ఇద్దరు పోలీసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. ఇప్పటికే హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని ఇళ్లకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. వారిద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఏసీపీ మానసతో వేర్వేరుగా మాట్లాడారు. సాయికృష్ణ నేరాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




