ఏపీ తెనాలీలో పోలీసులు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకే తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.
AP News: ఏపీలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్‌పై ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకు తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు
ఈ మేరకు దళితులు, మైనారిటీలే టార్గెట్ గా పోలీసులు దాడులు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కన్నా చిరంజీవి 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడానికి సంబంధం లేదని వాపోతున్నారు. అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డులో అందరూ చూస్తుండగా పోలీసుల జులుం ప్రదర్శించారని మండిపడుతున్నారు. తెనాలి 2 టౌన్ రాముల నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబుల దాష్టీకం ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
లంచం ఇవ్వనందుకే దాడి..
ఈ మేరకు ఇటీవల కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను ఏదో చిన్న విషయంలో లంచం ఇవ్వమని బెదిరించాడు. లేకపోతే అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు చెప్పమన్నారని వారిని భయపెట్టాడు. వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి.. అతని అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి యువకులపై అబద్ధపు కేసు పెట్టాడు. 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేయడం దారుణం అంటున్నారు.
బాధితులు చెంచుపేటకు చెందిన చేబ్రోలు జాన్ విక్టర్ (25) దళితుడు, ఐతానగర్ కు చెందిన దోమా రాకేష్ (25) దళితుడు, తిప్పర్ల బజార్ కు చెందిన షేక్ బాబులాల్ (21) సంవత్సరాలు ముస్లిమ్. ఈ ముగ్గురిని రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేశారు. వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా దాడిచేయడం అమానుషం. తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్, 3 టౌన్ CI రమేష్ బాబులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను బాధిత బంధువులు కోరారు.
నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి. కానీ ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. కొట్టే హక్కు మీకు లేదు అని చెప్పినా పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడా కనబడడం లేదని ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





