అంతా సజావుగానే సాగిపోయింది. ప్రేమ పెళ్ళికి ఇరు వర్గాల పెద్దలు, కుటుంబాలు ఒప్పుకున్నాయి. రేపు పెళ్లి అనుకుని.. ఈరోజు నిశ్చితార్థ ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ఇంతలోనే జరగాల్సింది జరిగిపోయింది. దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. వరుడు తీసుకున్న నిర్ణయంతో విషాదం అలుముకుంది.
కర్నూలు జిల్లా హోలగుందలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం తీసింది. హోలగుందకు చెందిన రాజు.. ఎండీ హల్లి గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. విషయం ఇద్దరి ఇళ్లల్లో చెప్పడంతో.. ఒప్పుకున్న తల్లిదండ్రులు.. ఈ నెల 16న పెళ్లికి ముహూర్తం పెట్టారు.
అంతా సజావుగా సాగుతుందన్న సమయానికి యువకుడి తల్లిదండ్రులు ట్విస్ట్ ఇచ్చారు. తమ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి జరపాలని పట్టుబట్టారు. అటు యువతి తల్లిదండ్రులు కూడా తమ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి జరపాలని పట్టుబట్టారు. రెండు కుటుంబాలు క్రైస్తవులే కావడంతో.. ఏదో ఒక సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరపండని.. పెళ్లి కొడుకు రాజు.. రెండు కుటుంబాలకు నచ్చ జెప్పినా వినలేదు. దీంతో.. మనస్థాపానికి గురైన రాజు.. బయటకు వెళ్లొస్తానని చెప్పి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ.. నిన్న రాత్రి చనిపోయాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
Also Read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




