విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. SMS -2లో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. SMS -2 విభాగంలోని మిషన్-2లో మంటలు ఎగసిపడుతున్నాయి. మిషన్-2లో ఆయిల్ లీకై ఘటన జరిగింది. నిప్పు రవ్వలు ఆయిల్‌పై పడి కేబుల్, మిషనరీ నుంచి మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా ద్రవరూపంలో ఉన్న ఉక్కు అంతా బయటకు వచ్చేసింది. ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చని చెప్తున్నారు. ప్రాణ నష్టం తప్పినట్టు ప్లాంట్ సిబ్బంది తెలిపారు
