వరంగల్ కమిషనరేట్ లో వివాదాస్పద సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా గత కొంతకాలం నుండి ముద్రవేసుకున్న మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు పడింది. నన్ను ఎవరు ఏం చేయలేరన్నట్లుగా చెలరేగిపోయిన ఆ సీఐ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పరకాలలో పీఎస్లో గతంలో సిఐగా పనిచేసిన వెంకటరత్నం కొద్దిరోజుల క్రితం అక్కడి నుండి వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పీఎస్కు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. అయితే స్థానిక మంత్రి అనుచరుడి మెప్పుకోసం కొన్నాళ్లు వాళ్లకు అనుకూలంగా పని చేసిన ఇతను వాళ్ల ద్వారా ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కొన్ని విషయాల్లో వారిని తప్పుదారి పట్టించి తన వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విదంగా ప్రవర్తించారని అతనిపై విమర్శలు ఉన్నాయి. అయితే నగరంలో కొద్దిరోజుల క్రితం హత్యకు గురైన ఓ వైద్యుడి భార్యపట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరిగినట్టు సమాచారం.
అయితే వైద్యుడి హత్యకేసులో అతని భార్యే ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి భార్తను హత్య చేసిందని ప్రియుడితో సహా ఆమెను జైలుకు పంపారు. ఈ క్రమంలో జైల్లో ఖైదీగా ఉన్న వైద్యుడి భార్యను విచారణ పేరుతో మూడురోజుల కస్టడీకి తీసుకున్న సీఐ.. పీఎస్ ఆవరణలోనే ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కస్టడీ విచారణ తర్వాత ఆమెను జైలుకు తరలించే సమయంలో ఈ విషయం బయటికి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ ప్రీత్ సింగ్ ఘటనపై విచారణ చేపట్టారు.విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆ సీఐను సీపీ సస్పెండ్ చేశారు.
అయితే ఇతనిపై ఇవే కాకుండా మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని విషయాల్లో మంత్రి అనుచరుడి మెప్పుకోసం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇస్టా రాజ్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మంత్రి అనుచరుడు చెప్పిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో కాల్ ద్వారా వారిని సంతృప్తి చెందేలా చేసేవారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో సీఐపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీఐ వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ సస్పెండ్ కావడంతో వరంగల్లోని ఆయన బాధితులు సంబరాలు జరుపుకుంటున్నారు
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





