హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మందకు కావలిగా ఉన్న నవీన్ అనే వ్యక్తితో పాటు అతని బావమరిదిపై దాడిచేశారు. సుమారు70 గొర్రెలను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
Hyderabad : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మందకు కావలిగా ఉన్న నవీన్ అనే వ్యక్తితో పాటు అతని బావమరిదిపై దాడిచేశారు. ఇద్దరిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేసి సుమారు70 గొర్రెలను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మందకు కావలిగా కానిస్టేబుల్ నవీన్ అతని బావమరిది రాత్రి సమయంలో అక్కడ పడుకున్నారు. అర్ధరాత్రి బొలెరో వాహనం లో వచ్చిన సుమారు పదిమందిలో ముగ్గురు అక్కడ కావలిగా పడుకున్న కానిస్టేబుల్ నవీన్, అతని బామ్మర్ది పై లేవకుండా కూర్చుని ఉండగా మరి కొంతమంది గొర్రెలను బొలెరో వాహనంలో ఎక్కించుకొని పరారయ్యారు. వారిని అడ్డుకున్న కానిస్టేబుల్ నవీన్ పై కత్తితో దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి పశువులు, మేకలు, గొర్రెలను ఎత్తుకెళ్తున్నారు. వారం రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక రైతు తన పొలంలో మేపుతున్న గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఒక పౌల్ట్రీ ఫామ్లో చొరబడిన దొంగలు పెద్ద సంఖ్యలో కోళ్లను దొంగిలించారు. గత నెలలో మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల కాపరులపై దాడి చేసి గొర్రెలను ఎత్తుకెళ్లారు వీరిలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కోహెడలో జరిగిన ఈ గొర్రెల దొంగతనం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా గొర్రెలకు కాపలగా పడుకుంటున్న గొర్రెల కాపరులు ఈ ఘటనతో భయాందోళనలకు గురవుతున్నారు.
Also read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





