అశ్లీల చిత్రాలకు బానిసై.. దివ్యాంగ సోదరిపై అత్యాచారానికి ఒడిగట్టాడో నిందితుడు. దీంతో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. నిందితుడిని గుర్తించలేని బాధితురాలి దుస్థితిని ఆసరాగా చేసుకుని నాలుగేళ్లు తప్పించుకున్న అతడు ఎట్టకేలకు డీఎన్ఏ పరీక్షలో దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో ఓ 16 ఏళ్ల బాలుడు అశ్లీల చిత్రాలకు బానిసై 14 ఏళ్ల తన దివ్యాంగ సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, బాలిక పరిస్థితి కారణంగా నిందితుడిని గుర్తించడం సవాల్ మారింది. దాదాపు 50 మందిని విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తుల్లోని అనుమానాస్పద వ్యక్తులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. చివరకు బాధితురాలి బిడ్డ డీఎన్ఏ ఆమె సోదరుడితో సరిపోలింది” అని పోలీసులు చెప్పారు.
బాలికపై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. డీఎన్ఏ నివేదిక రావడంతో.. అతడు తన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. దీంతో అతడిని అరెస్టు చేసి జువనైల్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం సంస్కరణ కేంద్రానికి తరలించారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





