చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్ లోని కాళీమందిర్కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది.
కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

యువతి అదృశ్యం
నాగోలు: ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్లో నివాసముండే సంకేపల్లి నిహారిక(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యు లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చంది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసి నా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





