కాకినాడ, : కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్కు గురయ్యారు.

అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది.
ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది.
అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





