హైదరాబాద్: సికింద్రాబాద్-మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





