ఏపీ మండపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సురేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురు దుర్గను.. తండ్రి రాంబాబు మందలించాడు. వెంటనే మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రియుడు, అతని ఫ్రెండ్ తో కలిసి తండ్రిని గొంతు పిసికి చంపింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు
Daughter killed father: ఓ కూతురు చేస్తున్న పాడు పని వద్దని చెప్పినందుకు తండ్రిపై దారుణానికి పాల్పడింది దుర్మార్గురాలు. ప్రియుడితో అక్రమ సంబంధం మంచిది కాదని, మానుకోవాలని మందలించిన కన్నవాడినే కాటికి పంపింది. ప్రియుడు, మరికొంతమంది సహకారంతో హతమార్చి అనుమానస్పద మృతిగా క్రియేట్ చేసింది. అయితే స్థానికులు, మృతుడి సన్నిహితుల ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది
పరువు పోతుంది మానుకోవాలని..
ఈ మేరకు మండపేట టౌన్ సీఐ దారం సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండపేటలో మార్చి 20న ఈ ఘటన చోటుచేసుకుంది.
మండపేట 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. కూతురు వెంకట దుర్గ రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు.. వెంటనే మానుకోవాలని, పరువు పోతుందని హెచ్చరించాడు. అయితే తండ్రి మందలించిన విషయాన్ని అర్థం చేసుకోకుండా పగ పెంచుకుంది దుర్గ. దీంతో ప్రియుడితో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ చేసింది. మార్చి16న రాంబాబు ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు సురేష్, అతని ఫ్రెండ్ తాటికొండ నాగార్జునను ఇంటికి పిలిచింది. ముగ్గురూ కలిసి మంచంపై పడుకున్న రాంబాబు మీద కూర్చోని శ్వాస ఆడకుండా గొంతు పిసికి చంపేశారు.
ఆ తర్వాత తండ్రి నిద్రలోనే కన్నుమూశాడంటూ తనకేమి తెలియనట్లు నటించింది. మృతుడి సోదరుడు సూరా పండు రాంబాబు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించాడు. వెంటనే దుర్గపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దుర్గ నిజం ఒప్పుకోగా.. నిందితులను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్‌కు తీసుకెళ్లి..





