అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి మరణించింది. స్నేహితురాలితో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో దీప్తి మృతి చెందగా మరో యువతి గాయపడింది.
పై చదవుల కోసమై విదేశాలకు వెళ్లిన..కొందరు యువత విగతజీవులుగా ఇంటికి చేరుతున్నారు. అక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కాల్పులు, కత్తుల దాడుల్లో కొందరు విద్యార్తులు చనిపోతుంటే..రోడ్డు ప్రమాదాల్లో మరి కొందరు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మరణించింది.
గుంటూరు జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన దీప్తి పై చదువుల కోసం కొన్నాళ్ల క్రితం యూఎస్ వెళ్లింది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేస్తోంది. అయితే ఈ నెల 12న తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు వాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి మరణించగా, మరో యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంకో నెల రోజుల్లో దీప్తి కోర్సు పూర్తి కానుంది. కోర్సు పూర్తయ్యాకు దీప్తి ఇండియాకు వద్దామనుకున్నట్టు తెలుస్తోంది.
నెల రోజుల్లో చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుందనుకున్న కూతురు..ఏకంగా తిరిగి రాని లోకాలకే వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి పోయారు.
Also read
- హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
- Video: విధి ఆడిన ఆట.. బైకర్ ఆవేశం.. లారీ డ్రైవర్ కాపాడే యత్నం.. పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్
- KGBVలో అమానుషం.. అర్ధరాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలపై ఎలుకల దాడి! ఆ తర్వాత..
- Arava Sridhar: ఢిల్లీ కి చేరిన ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్, లోక్ పాల్ చేరిన బాధితురాలి ఆవేదన!
- పోలీస్ వ్యాన్‌లో నుంచి పుష్ప స్టైల్ లో ‘తగ్గేదేలే’ అన్న అంబటి రాంబాబు





