అనకాపల్లి జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెట్టుపల్లికి ప్రాంతానికి చెందిన బాలనాగేశ్వరరావు దంపతులకు కవల పిల్లలు పాప, బాబు ఉన్నారు. సోదరుడితో కలిసి శ్రావ్య శ్రీ శర్వాణి పెదబొడ్డేపల్లిలోని ఓ కాన్వెంట్లో చదువుతోంది. రోజు మాదిరిగానే యూనిఫాం వేసుకుని.. బ్యాగు ఎత్తుకొని సోదరుడుతో కలిసి బడికి బయలుదేరింది. ఇద్దరు తల్లికి టాటా చెప్పి ఆటో ఎక్కారు. ఆటో బడికి బయలుదేరింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెట్టుపల్లికి ప్రాంతానికి చెందిన బాలనాగేశ్వరరావు దంపతులకు కవల పిల్లలు పాప, బాబు ఉన్నారు. సోదరుడితో కలిసి శ్రావ్య శ్రీ శర్వాణి పెదబొడ్డేపల్లిలోని ఓ కాన్వెంట్లో చదువుతోంది. రోజు మాదిరిగానే యూనిఫాం వేసుకుని.. బ్యాగు ఎత్తుకొని సోదరుడుతో కలిసి బడికి బయలుదేరింది. ఇద్దరు తల్లికి టాటా చెప్పి ఆటో ఎక్కారు. ఆటో బడికి బయలుదేరింది. స్కూల్‌కి చేరుకునే లోపే.. చెట్టుపల్లి వద్ద ఆటో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న రొయ్యల ఫ్యాక్టరీ బస్సు అదుపుతప్పి ఆటోను రాసుకుంటూ వెళ్లింది. దీంతో ఆటో అదుపు తప్పింది.
ఆ సమయంలో ఆటోలో చిన్నారి శర్వాణి సోదరుడితోపాటు ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఓ పక్కన కూర్చుని స్టీల్ రాడ్డును పట్టుకుంది. బస్సు ఆటోను తాకి రాసుకుని వెళ్లడంతో శర్వాణి కుడి చేయి నుజ్జునుజ్జు అయ్యింది. ఉంగరం వేలు, మధ్య వేలు తెగిపోయాయి. వీటిలో ఒక వేలు దొరకగా.. మరో వేలు కనిపించలేదు. దీంతో దొరికిన వేలితో వెంటనే చిన్నారిని హుటాహుటిన నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..