October 18, 2024
SGSTV NEWS
CrimeTelangana

Murder: తల్లిపై కన్నేశాడు.. కూతుర్ని కడతేర్చాడు

హైదరాబాద్, కుత్బుల్లాపూర్, : ఓ వివాహిత మీద కన్నేసిన దుర్మార్గుడు.. తనకు అడొస్తుందనే ఉద్దేశంతో ఏడేళ్ల బాలికను కిరాతకంగా హతమార్చాడు. గోనె సంచిలో మూటకట్టి అటవీ ప్రాంతంలో విసిరేశాడు. హైదరాబాద్లోని సూరారం పోలీస్టేషన్ పరిధిలో దసరా రోజు జరిగిన ఈ దారుణం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి చెందిన మిశ్రమ్ ప్రభాకర్ (40) ఏడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కూలి పనులు చేసుకునే అతను, పాటగూడ గ్రామానికే చెందిన ఇద్దరు కుమార్తెలున్న మహిళతో కలిసి కుత్బుల్లాపూర్ పరిధి సూరారం జీవన్ జ్యోతినగర్లో నివాసం ఉంటున్నాడు. ఆమె పెద్ద కుమార్తెకు ఏడేళ్లు. ప్రభాకర్కు తన ప్రాంతానికే చెందిన, జీవన్ జ్యోతినగర్ సమీపంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకునే తిరుపతితో పరిచయముంది. ప్రభాకర్ ఇంట్లో తరచూ ఇద్దరూ మద్యం తాగేవారు. ఆ క్రమంలో మహిళపై కన్నేసిన తిరుపతి,.. ప్రభాకర్తోపాటు ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకుంటే ఆమెను సొంతం చేసుకోవచ్చని పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 12న ఉదయం ఆమె పెద్ద కుమార్తెను ద్విచక్ర వాహనంలో తన ఇంటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తీసుకొచ్చి వదిలేశాడు.సాయంత్రం 5 గంటల సమయంలో ప్రభాకర్ ఇంటి వద్ద ఎవరూ లేని సమయం చూసి బాలికను మళ్లీ తీసుకెళ్లాడు. పొద్దుపోయే వరకూ ద్విచక్రవాహనంపై తిప్పుతూ.. చీకటిపడ్డాక మేడ్చల్ పోలిస్ స్టేషన్ పరిధి బాసరేగడి గ్రామం దగ్గర కత్తితో పొడిచి చంపేశాడు. బాలిక మరణించినట్లు నిర్ధారించుకున్నాక గోనె సంచిలో మూటకట్టి.. అక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు.

బాలిక అదృశ్యమైనట్టు వచ్చిన ఫిర్యాదుతో

బాలిక అదృశ్యమైనట్టు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. తిరుపతి చిన్నారిని ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించడంతో, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక హత్యకు ఇంకేమైనా కారణాలున్నాయా? అనే దిశగా విచారిస్తున్న పోలీసులు.. కేసు వివరాలు బుధవారం వెల్లడించే అవకాశముంది.

Also read

Related posts

Share via