కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కకు విసిరేసి వెళ్లారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కకు విసిరేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన కొందరు ఓ పసికందును విసిరేశారు. అటువైపుగా వెళ్తున్న చొక్కారెడ్డి అనే రైతు పసికందు ఏడుపు విని దగ్గరకెళ్లి చూశాడు. కెనాల్ పక్కన ఓ మూటలో మగ శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. శిశువు జన్మించి మూడు రోజులు అవుతుందని, శిశువు శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. గుర్తు తెలియని మగ శిశువు లభ్యమైందని, ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Also read
- భార్య పుట్టినరోజు.. వస్తుందని బస్టాండ్లో ఆశగా ఎదురుచూశాడు.. చివరికి ఊహించని ఘటన
- విశాఖ: పాక్ హనీ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్
- పెళ్లి అయినా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం
- ప్లీజ్.. లిఫ్ట్ కావాలంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బండి ఆపాడు.. ఆ తర్వాత 2 గంటలపాటు..
- సీసీ కెమెరాలు బిగిస్తూ ఇద్దరి మృతి





