బ్రాండెడ్ వస్తువుల పేరుతో తక్కువ ధరకే ఆపిల్ ఫోన్లు, వాచీలు ఇస్తామంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన తొమ్మిది మంది సభ్యుల ముఠా హైదరాబాద్ లక్ష్యంగా ఈ మోసాలకు పాలడుతున్నే పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 14 ఆపిల్ ఇయర్ ఫోన్స్, 14 ఆపిల్ వాచెస్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకన్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నకిలీ ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అనాజ్, మహమ్మద్ ఫార్మన్, మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ జునీద్, మోహిద్ వాసిన్, మహమ్మద్ సోయబ్ కురుషి, ధనుష్ అహ్మద్, మోహిద్ షకీబ్, రవి కమలేష్ గుప్తాలు ఒక ముఠాగా ఏర్పడి.. ఘజియాబాద్ నుండి భారీ సంఖ్యలో నకిలీ ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్ , ఆపిల్ వాచీలను సేకరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు తెలిపారు.
ఈ 9 మంది ముఠా ముఖ్యంగా హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్, శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో తిరుగుతూ.. అత్యవసరంగా డబ్బులు కావాలని లేదా తక్కువ ధరకే కొత్త మోడల్ ఐఫోన్లు ఇస్తామని అమాయకులను నమ్మించి వారి నుంచి డబ్బులు కాజేసే వారని గుర్తించారు. అవి నకిలీవని తెలియని బాధితులు, నిందితులు చెప్పే మాటలు నమ్మి వేలకు వేలు చెల్లించి మోసపోయారని తెలిపారు.
కొందరు బాధితులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీరిపై నిఘా పెట్టి, ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు నకిలీ ఆపిల్ మొబైల్ ఫోన్స్, 14 ఆపిల్ ఇయర్ ఫోన్స్, 14 ఆపిల్ వాచెస్ తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని.. పరారీలో ఉన్న దినేష్ అహ్మద్, మహమ్మద్ రవి, కమలేష్ గుప్తాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
అపరిచిత వ్యక్తులు రోడ్లపై తక్కువ ధరకే ఐఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామంటే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. కేవలం గుర్తింపు పొందిన షోరూమ్‌లలోనే వస్తువులను కొనుగోలు చేయాలని, ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also read
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!
- చదువుల పండుగలో చేదు ఘటన.. స్కూల్ గేటు వద్ద కుప్పకూలిన విద్యార్థి!
- చచ్చే వయసులో ఇదేం పోయేకాలం .. షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు.. చివరకు
- ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. తెల్లారి స్విమ్మింగ్ పూల్‌లో తేలిన టెకీ డెడ్ బాడీ..! మిస్టరీగా మరణం
- పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది?





