విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించాడు.
కంకిపాడు , : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించాడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గాంధీనగర్ ఎంపీపీ మోడల్ పాఠశాలలో మండవ శ్రీనివాస్(61) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ బాధిత విద్యార్థిని ఆదివారం ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన మిగిలిన బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాలూ అందుకున్నాడు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులనిచ్చారు.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





