పేరుకు ప్రముఖ డాక్టర్.. కానీ చేసేదీ మాత్రం నీచపు పనులు.. అమెరికాలో చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారత సంతతికి చెందిన డాక్టర్‌ను అతని భార్యనే పోలీసులకు పట్టించింది. ఆస్పత్రి పరిసరాలు, గదులు, బాత్రూంల్లో రహస్య కెమెరాలు అమర్చి, ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేస్తున్న ఉమేర్ ఏజాజ్ అనే వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూర్ హార్డ్ డిస్క్‌లో 13వేలకు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఎంతో మంది మహిళలతో లైంగికచర్యల పాల్పడిన వీడియోలను సైతం అతను రికార్డు చేసినట్టు ఒక్లాండ్ కౌంటీ పోలీస్ అధికారి తెలిపారు.
ఇలా రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలను ఉమేర్ ఏజాజ్ తన ఇంట్లోని కంప్యూటర్, మొబైల్ ఫోన్లతోపాటు 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లలో భద్రపరిచాడు. అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజీలోను ఈ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నాడు. ఈ దర్మార్గాన్ని అతని భార్య బయటపెట్టి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. నీచపు డాక్టర్‌ను పోలీసులకు పట్టించింది.
2011లో వర్క్ వీసాపై ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఒయిమెయిర్ ఎజాజ్ అలబామాలో కొన్నేళ్లపాటు నివాసం ఉన్నాడు. 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. అక్కడ పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే పనిచేసే ప్రతీచోట రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల నగ్న వీడియోలను చిత్రీకరించాడు. అలా రికార్డు చేసిన చిత్రాలను తన కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల్లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మహిళా రోగులు స్పృహలో లేనప్పుడు వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను కూడా రికార్డు చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు, అతని ఇంటిని సోదా చేశారు. ఈ వీడియోల భాగోతం బయటపడింది. నిందితుడు ఉమేర్ ఏజాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..