బెంగళూరు బనశంకరి : విదేశాల్లో కూర్చుని యువతులకు గాలం వేస్తున్న భర్త బండారాన్ని భార్యనే రట్టు చేసింది. భర్త కామకలాపాలపై మంగళూరు మహిళా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. మనీశ్ అనే వ్యక్తి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకున్నాడు. డబ్బులేదని వివాహానికి ముందు ఆత్మహత్య నాటకమాడాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులే పెళ్లి ఖర్చులు భరించారు. ఉద్యోగం కోసం భార్యనే రూ.2 లక్షలు ఇచ్చింది.
దుబాయ్ వెళ్లిన అతను బహరాన్లో మరో మహిళతో ప్రేమకలాపాలు సాగించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతని వ్యవహారంపై నిఘా పెట్టగా వివాహానికి ముందు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకుంది. వారి వద్ద కూడా అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగిట్లు తేలింది. టిక్‌టాక్ యువతులకు గాలం వేసే మనీశ్నుంచి ఎవరూ మోసపోవద్దని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





