July 2, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటతాయి, చేతలు మాత్రం గడప దాటవు…

*మచిలీపట్నం*
*10/04/2024*

*వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాలకులకు వచ్చే ఎన్నికలలో పుట్టగతులు ఉండవు….*

*జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే కోటలు దాటతాయి, చేతలు మాత్రం గడప దాటవు….*

*ఎన్డీఏ ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం…. తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ….*

*తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ బుధవారం మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….*

ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఒక్క రైతు అయినా బాగున్నాడా? మనకు తిండి పెట్టే రైతన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుదేలు అయింది అన్నారు.

ధాన్యం కొన్న రైతుల కు కనీసం వైసిపి ప్రభుత్వం వెంటనే డబ్బులు కూడా చెల్లించలేని హీనస్థితిలో ఉందంటే రైతుల మీద వైసిపి ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం మవు తోంది అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రజాప్రతినిధులకు రైతులంటే గౌరవం లేదని, సాగు రైతులను వైసీపీ పాలకులు నిలువునా ముంచేశారని మండిపడ్డారు.

దేశం మొత్తంలో మన రాష్ట్రం లోని 93 శాతం మంది రైతులు వైసీపీ పాలకుల నిర్వాకం వల్ల అప్పులలో కూరుకు పోయారు అన్నారు.

2014లో మన తెలుగుదేశం ప్రభుత్వమే రైతు రుణమాఫీ చేసింది అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు రైతులకు సబ్సిడీపై ఎరువులు, ట్రాక్టర్లు, విత్తనాలు, ఇలా ఎన్నో రకాలుగా సహాయం అందిస్తే నేటి వైసిపి ప్రభుత్వం లో అటువంటి దాఖలాలు ఏమీ లేవన్నారు.

రైతు భరోసా కింద 12,500ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో రైతులను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రాగానే 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్న మాట నిజం కాదా? అని విమర్శించారు. ఆ ఇచ్చే 7,500 కూడా వివిధ రకాల ఆంక్షలతో చాలామంది రైతులకు ఎగ్గొట్టారు అన్నారు.

వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తాము అన్నారు.

ఇప్పటికే రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయారని, వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని రైతులకు మేలు చేసే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన రైతులందరిపై ఉంది అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా, ప్రచార కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీరైతు నాయకులు, పామర్తి లక్ష్మణ్, వేముల శివాజీ, ఆళ్ల మాధవ, బడే రమణ, వాటపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via