మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత – లోపలికి వెళ్లిన మంచు మనోజ్..!
Manchu family Controversy : తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత.. మంచు మనోజ్ దంపతులు లోపలికి వెళ్లారు. తాత, నానమ్మ సమాధికి నివాళులర్పించారు.
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ ర్యాలీగా యూనివర్శిటీ వద్దకు రాగా…. పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా… మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బాన్సర్ల గొడవ పడ్డారు. ఓ దశలో ఒకరినొకరు నెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
వీడియో
తన అనుచరులతో కలిసి మంచు మనోజ్ యూనివర్శిటీ గేటు వద్దకు చేరుకున్నారు. గేటు తీయకపోవటంతో ఆందోళన చేపట్టారు. గేటు లోపల ఉన్న వ్యక్తిని ఓరేయ్ ‘ఎలుగుబంటి’.. గేట్ తీయ్ అంటూ వ్యాఖ్యానించారు. ఎందుకురా భయపడుతున్నారు? అంటూ మాట్లాడారు. చివరగా యూనివర్శిటీ మూడో గేటు నుంచి యూనివర్సిటీ లోపలికి మంచు మనోజ్ వెళ్లారు. తాత, నానమ్మ సమాధికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ…”మా తాత నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకుందాం అని యూనివర్సిటీకి వచ్చాను. విద్యార్థుల కోసం ప్రశ్నించినందుకు నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేసి మా అమ్మ బ్రెయిన్ వాష్ చేశారు. రోడ్డు మీద పోలీసులను పెట్టారు. రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. అయినా మా తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి?’ అంటూ మనోజ్ ప్రశ్నించారు.
పోలీసులతో చర్చల తర్వాత…సమాధి వద్దకు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. నివాళులు అర్పించిన తర్వాత అక్కడ్నుంచి వెనక్కి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది.
మంత్రి లోకేశ్ తో మనోజ్ భేటీ:
యూనివర్శిటీలోకి వెళ్లటం కంటే ముందు… మంచు మనోజ్ మంత్రి లోకేశ్ తో భేటీ అయ్యారు. నారావారిపల్లెకు చేరుకున్న మనోజ్ లోకేష్‌తో సమావేశమయ్యారు. అయితే వీరిద్దరి భేటీలో ఏం చర్చించుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మనోజ్… జనసేనలో చేరుతారనే వార్తలు బలంగా వినిపించాయి. దీనిపై మనోజ్ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మంత్రి లోకేశ్ తో భేటీ నేపథ్యంలో… ఆయన రాజకీయంగా అడుగులు వేయబోతున్నారా అన్న చర్చ మళ్లీ మొదలైంది.
Also read
- చిన్నారి సహా భార్యభర్తలు మృతి.. దహన సంస్కారాలను వీడియో కాల్లో వీక్షించిన తల్లిదండ్రులు!
- పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం.. కట్‌చేస్తే..
- GITAM University: యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్





