బనశంకరి(బెంగళూరు): సహజీవన బంధాలు ఎక్కువగా
విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్లో పనిచేస్తూ ఇన్స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.
భర్త, పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





