ఓ ప్రాంతంలో నిధుల కోసం కొందరు వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఐదుగురు నిందితులను..
చెన్నూర్, మే : కొందరు కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి భారీగా ఆశలు చూపి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం రచ్చపెల్లి గ్రామంలోని ఓ ప్రాంతంలో నిధుల కోసం కొందరు వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.
వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రచ్చపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల పేరిట పూజలు, తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రచ్చపల్లి గ్రామ సమీపంలోని వ్య సాయ భూమిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి సంఘటనా స్థలానికి వెళ్లగా.. పోలీసులను చూసి వారు పారిపోయారు. అక్కడ పూజా వస్తువులు, ఇతర సామగ్రి లభించాయి. రెవెన్యూ అధికారుల ద్వారా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
రచ్చపల్లికి చెందిన జక్కుల కుమార్ తన భూమిలో గుప్తనిధులు వెలికి తీసేందుకు స్థానికుడైన మరాఠీ స్వామితో పాటు చెన్నూరు, భీమారం మండలాల్లోని చాకేపల్లి, పొన్నారం, ఆరెపల్లి, మద్దికల్ గ్రామాలకు చెందిన సోదరి రాజస మ్మయ్య, కస్తూరి భూమయ్య, రాజేష్, జాడి నర్సయ్య, తిప్పర్తి రమేష్‌లను పురమాయించాడు. వారంతా కలిసి తవ్వకాలు జరిపేందుకు సిద్ధమైనట్లు తమ విచారణలో తేలిందన్నారు. జక్కుల కుమార్, మరాఠీ స్వామి పరారీలో ఉండగా.. మిగతా అయిదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వివరించారు.
Also read
- ఇన్స్టాగ్రామ్ పరిచయం.. ఇంట్లోనే ఆశ్రయం పొంది 4.5 తులాల బంగారం చోరీ!
- కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!
- Panchakshari Mantra: ఓం నమః శివాయకు ఇన్ని రూపాలున్నాయా? పంచాక్షరిలోని రకాల గురించి తెలుసా?
- కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!
- జనసేన నేత కోట రుక్మిణి రూ.7 కోట్ల చీటింగ్ కేసులో ట్విస్ట్





