Dundigal: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడి దొంగలు విధ్వంసం సృష్టించారు. మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద(50) అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అక్కడ దోపిడి దొంగలు విధ్వంసం సృష్టించారు. మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద(50) అనే మహిళను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకొని వెళ్ళిపోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారు చేరుకునేసరికి ఇల్లంతా కూడా రక్తపు మరకలు కనిపించాయి. దీన్ని బట్టి ఆమెను దొంగలు ఎంత దారుణంగా హత్య చేసారో తెలుస్తుంది. ఆ రక్తపు మరకలను చూస్తుంటే ఆ మహిళా ఆ దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుందని తెలుస్తుంది.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మహిళా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇదేదో ప్లాన్ చేసి తెలిసిన వాళ్ళే హత్య చేసారేమో అని సమాచారం తెలుస్తుంది. ఆమె అరుపులు స్తానికులకు వినపడకుండా అతి దారుణంగా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శారద, ఆమె కుమారుడు నివసిస్తున్నారు. సోమవారం ఉదయం ఆమెను యథావిధిగా ఇంట్లోనే ఉంచి కొడుకు సాయి వినయ్ తన పనికి వెళ్లాడు.
రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చే ముందు తన తల్లికి వినయ్ ఫోన్ చేశాడు. అయితే ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయ్యకపోవడంతో అతను ఆమె గురించి తెలుసుకోవడానికి పొరుగువారికి కాల్ చేశాడు.ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న శారదను ఇరుగుపొరుగు వారు చూసి షాక్ అయ్యారు. దీంతో వెంటనే సాయి వినయ్ కి సమాచారం అందించడంతో అతడు వెంటనే ఇంటికి చేరుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. నిందితులు ఆమెను హత్య చేసి బంగారు చెవిపోగులు, ముక్కు పుడకను దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కూడా జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే