ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు.. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి.. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది…
ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు.. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి.. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది.. రోడ్డు ప్రమాద రూపంలో భర్తను విడదీసింది.. చేదువార్త విన్న ఆమె గుండె పగిలింది.. భర్తలేని లోకంలో నేనుండలేనంటూ తానూ వెళ్లిపోయింది.. ఈ హృదయ విదారక ఘటన లావేరు మండలంలో చోటుచేసుకుంది..
లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన నాయిని చంటి ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ నందిగాంకు చెందిన భవానీ ప్రేమించుకొని ఏడాదిన్నర కిందట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చంటి దసరా రోజున ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మురపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.. భర్త మరణవార్త విన్న భవానీ ఆదివారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. ఈ ఘటనతో కేశవరాయనపాలెం గ్రామం విషాదంలో మునిగిపోయింది. భవాని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లావేరు పోలీసులు ఈ ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- గుంటూరు పశ్చిమ టిడిపి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడుగా జొన్నలగడ్డ ఉదయభాను నియామకం పట్ల పలువురు హర్షం
- కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
- Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!
- Vepa Puvvu Pachadi: వేప పువ్వును ఉగాది పచ్చడికే వాడుతున్నారా?.. ఈ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదలరు!
- ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!





