మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆమె ఎక్కిన ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ తర్వాత డ్రైవర్ దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై డ్రైవర్ ఆటోలోనే అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.. అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయాడని తెలిపింది.
యువతి అమీర్‌పేటలోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తుందని సమచారం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
కాగా.. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- రావణుడి అంత్యక్రియలు ఎవరు నిర్వహించారు? రాముడి ఆదేశంతో ఏం జరిగిందంటే..!?
- Dhantrayodashi 2022 ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు పూజిస్తారో తెలుసా…
- Dhanteras: ధన్తేరస్ నవంబర్ 6 లేదా 7న? పూజా ముహూర్తం, బంగారం కొనుగోలు శుభ సమయాలు ఇవే!
- Diwali: దీపావళి ఎప్పుడు? లక్ష్మీ పూజ ముహూర్తం, పండుగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలుసుకోండి!





