విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విశాఖపట్నం: విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూపన్లు ఇచ్చారు.. తమకు డబ్బులు అందలేదంటూ ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లిఫ్ట్ ఆపేసి, గేటుకు తాళాలు వేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి పంపించేశారు.
గత రెండు నెలలుగా ఎంవీవీ.. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. సభలు, సమావేశాల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. దీంతో భారీగానే తాయిలాలు అందుతాయని స్థానికులు ఆశించారు. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. కూపన్లు ఇచ్చినప్పటికీ డబ్బులు అందలేదని కొందరు నేరుగా ఆయన ఇంటికే వచ్చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025