కొండుకూర్‌లో రాత్రి పట్టుబడిన దొంగ పోలీసు
గతంలో కరీంనగర్‌లో స్వామిజీ వేషధారణలోఇప్పుడు పోలీసు డ్రెస్ వేసుకుని మరీ.. దొంగతనం

ఆదిలాబాద్: సాధారణంగా దొంగలు పోలీసులకు భయపడుతుంటారు. ఎక్కడ వచ్చి పట్టుకుంటారో అని. అందుకే ఓ దొంగ వినూత్నంగా ఆలోచించాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలంటే తానూ వారిలో ఒకడిగా మారిపోతే పోలా.. అనుకున్నాడు. ఎలాగో ఓ పోలీసు యూనిఫాం సంపాదించాడు. రోజూ ఆ పోలీసు దుస్తులు వేసుకొని తానొక కానిస్టేబుల్‌ని అంటూ లాఠీ చేత్తో పట్టుకొని బిల్డప్ ఇస్తూ వీలు చిక్కిన దగ్గరల్లా చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. పోలీసు గెటప్ వేసినా దొంగ లక్షణం పోదుకదా.. దొరికిపోయాడు. అసలు పోలీసులు రంగంలోకి దిగేసరికి నకిలీ పోలీసు బాగోతం బయటపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కడెం మండలం కోండుకూరు గ్రామంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానికులు తలల పట్టుకున్నారు. చివరికి ఓ పోలీసే దొంగ అని తెలిసి అవాక్కయ్యారు. కానిస్టేబుల్ బట్టలు వేసుకొని, లాఠీ చేత్తోపట్టుకొని ఠీవీగా వచ్చి పెట్రోలు బంకులో సెల్‌ఫోను కొట్టేసి, సమీపంలోని ఓ దాబాలో మరో చోరీకి యత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





