బెంగళూరులో ఉజ్బెకిస్తాన్ మహిళ జరీనా హత్య కేసులో రాబర్ట్, అమృత్ సోను అనే ఇద్దరిని బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్, విదేశీ కరెన్సీ కోసమే జరీనాను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. హోట్‌ల్ సీసీటీవీ కెమరాల ఫుటేజిని పరిశీలించి కేసును పోలీసులు చేధించారు. బెంగళూరులోని జగదీష్ హోటల్‌లో జరీనా బుధవారం హత్యకు గురైంది. హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితులిద్దరు జరీనా స్టే చేసిన హోటల్‌లోనే హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. నిందితులిద్దరూ అస్సోంకు చెందిన వారే. జరీనాను హత్య చేసిన అనంతరం రూమ్ లాక్ చేసి వీరిద్దరూ కేరళ పారిపోయారు. విచారణ సమయంలో ఉజ్బెకిస్తాన్ కరెన్సీని పోలీసులు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025