శ్రీవారి పరకామణిలో చోరశిఖామణి వ్యవహారం..ఇప్పుడు పొలిటికల్ తుఫాన్‌కు దారి తీస్తోంది. ఇది వైసీపీ వర్సెస్ కూటమి ఎపిసోడ్‌గా టర్న్ తీసుకుంది. దీనిలో తన ప్రమేయం ఉందని తేలితే, అలిపిరిలో తల నరుక్కుంటానని, దమ్ముంటే సీబీఐతో విచారణ జరిపించాలని భూమన చాలెంజ్ చేశారు. 2 రోజుల్లో సంచలన విషయాలు బయటకొస్తాయంటూ భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు.
నిత్యకల్యాణం..పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల కొండ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల లడ్డూ వివాదం బైటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటుంది. తాజాగా టీడీ పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భూమన వర్సెస్ భానుప్రకాష్ అండ్ కిరణ్ రాయల్‌గా ఈ ఎపిసోడ్ టర్న్ తీసుకుంది. పరకామణి పాలిటిక్స్ ఏపీలో కాక రేపుతోంది. తన హయాంలో తప్పు జరిగిందని తెలిస్తే తల నరుక్కుంటానన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.
సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్
పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. 20 ఏళ్లుగా రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో కూడా దొంగతనాలు చేశాడని, అప్పుడు రవికుమార్‌ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు భూమన. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు భూమన.
2 రోజుల్లో వెలుగులోకి సంచలన విషయాలు
ఇదే విషయంపై బిజేపీ నేత భానుప్రకాష్ మాట్లాడతూ.. మరో రెండు రోజుల్లో సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు. సీబీఐ దాకా పనిలేదు, ఎస్సై విచారించినా అన్నీ తెలుస్తాయని భూమనకు కౌంటర్ ఇచ్చారు.
రూ. 300 కోట్ల దోపిడీ అన్న కిరణ్ రాయల్
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ బతికి ఉన్నాడో లేదో అనుమానంగా ఉందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. రవికుమార్ 300 కోట్లు దొంగతనం చేశాడని ఆరోపించారు కిరణ్ రాయల్. రవికుమార్ నుంచి వైసీపీ పెద్ద తలకాయలతో పాటు అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని ఆరోపించారు జనసేన నేత.
అయితే తిరుమలలో వెలుగు చూస్తున్న ఈ వరుస వివాదాలు..ఓవైపు రాజకీయ రచ్చ రేపుతుండగా మరోవైపు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు! ఈ మేటర్‌లో చోరుల వెనక ఉన్న అసలు వ్యక్తులెవరు? జాడ తెలుసుకోవాలని.. శ్రీవారి సొమ్ము నొక్కేసిన రవికుమార్ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలంటున్నారు భక్తులు.
Also read
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే





