రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. కారణం ఏంటో ఆలస్యంగా తెలుసుకున్నారు మందు బాబులు. వేరే షాపుల కంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు ఒక ధర ఇప్పుడు సిండికేట్‌గా మారి.. అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో నాలుగు బ్రాందీ షాపులను లూటీ చేశారు మందుబాబులు. దాడి చేసి బాటిల్లను ఎత్తుకెళ్లారు. సుమారు 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొంతమంది మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను నిలదీశారు. దీంతో షాప్ యజమానులకు మందుబాబులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అది చిలికి చిలికి గాలి వానలా మారి షాపులను లూటీ చేసే స్థితికి చేరింది. అందినకాడికి మద్యం బాటిళ్లను దోచుకొని వెళ్ళారు.
ఇదే అవకాశంగా అనుకుని అటుగా వెళ్ళే మహిళలు కూడా షాపులో ఉన్న మద్యం బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. అయితే మద్యం షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ఒక నేత ఆధీనంలో ఈ వైన్ షాపు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను ఇతర మద్యం వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ లోపు చాలా మంది మద్యం బాటిళ్లను బాక్సుల్లో ఎత్తుకెళ్లారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





