SGSTV NEWS online
Andhra PradeshCrime

Vijayawada: విజయవాడలో నడి రోడ్డుపై మహిళ దారుణ హత్య



సూర్యారావుపేట: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను.. భర్తే నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతిగా గుర్తించారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. నడిరోడ్డుపై ఆమెను హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read

Related posts