BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు
TV Anchor Swetcha Incident: BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు. వారి మధ్య విభేదాల వల్లే ఆత్మహత్య( Sucide ) చేసుకున్నట్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్ చిక్కడపల్లి పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. అనంతరం స్వేచ్ఛ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. స్వేచ్ఛ చివరిసారిగా ఎవరితో మాట్లాడింది? ఎవరితో చాటింగ్ చేసిందనే వివరాలకోసం వాట్సప్ పరిశీలిస్తున్నారు. ఇక పూర్ణచంద్ 2023 ఎన్నికల్లో బీర్ఎస్ తరఫున ఖానాపూర్ టికెట్ ఆశించినా టికెట్ దక్కలేదు. ఆ తర్వాత గ్రీన్ ఛాలెంజ్ లోనూ కీలకంగా వ్యవహరించారు
మొదటి భర్తతో ఐదేళ్ల క్రితం విడాకులు..
ఈ మేరకు స్వేచ్ఛ తండ్రి శంకర్ మాట్లాడుతూ.. ‘మొదటి భర్తతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. నిన్న మధ్యాహ్నమే నేను స్వేచ్ఛతో మాట్లాడాను. పూర్ణచందర్‌తో విడిపోతున్నా అని చెప్పింది. ఇంతలోనే ఇలా చేసుకుంది. ఈ నెల 26 వరకు పూర్ణచందర్ ఎవరో నాకు తెలియదు. పూర్ణచందర్‌కు ఇతర మహిళలతోనూ సంబంధాలున్నాయి. స్వేచ్ఛకు పూర్ణచందర్ అఫైర్స్ గురించి చెప్పినా వినలేదు. పూర్ణ చందర్ కు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు. అయినా నా కూతుర్ని మూడేళ్లుగా హింసిస్తున్నాడు’ అంటూ కన్నీటిపర్యంమయ్యారు. ఇక పరారీలో ఉన్న పూర్ణచందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు

ఇక పూర్ణచందర్ వల్లనే అమ్మ చనిపోయిందని స్వేచ్ఛ కూతురు చెబుతోంది. వాన్ని నమ్మి అమ్మ మోసపోయిందని, వాడు మంచివాడు కాదని తనకు అనిపించినట్లు చెప్పింది. ‘అమ్మ వద్దమ్మా అని చెప్పినా వినలేదు. అతను వాళ్ల భార్యకు విడాకులు ఇస్తా అన్నాడు. పూర్ణచందర్ నాకు నచ్చలేదు. రోజూ హగ్ ఇచ్చి నన్ను స్కూల్ కు పంపేది. ఇప్పుడెవరు హగ్ చేసుకుంటారంటూ స్వేచ్ఛ కూతురు ఏడుస్తేంటే గుండె తరుక్కుపోతుంది.
Also read
- నేటి జాతకములు 14 జూలై, 2025
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో