నడిరోడ్డుపై తాగుబోతు చేసిన పనితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతడిని ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్‌గా మార్చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లు తెలియకుండా ఫుల్‌గా మద్యం తాగిన అతడు..మందు మైకంలో నాకెవరు అడ్డు చెప్పేది.. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే, గుర్రుపెట్టి నిద్రపోయాడు.
మందుబాబులా మజాకా.. తాగిన మందు నషాళానికి ఎక్కిన తరువాత వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. కొందరు తాగేసి గొడవలు సృష్టిస్తారు. మరికొందరు ఎత్తైన టవర్లు, స్తంబాలు ఎక్కేస్తుంటారు. మరికొందరు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇంకొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక విజయవాడలో నడి రోడ్డుపై ఓ మందుబాబు చేసిన రచ్చ ఎలా ఉందంటే.. ఫుటుగా తాగేసిన అతడు..తన స్కూటీని అక్కడే వదిలేసి నడిరోడ్డుపైనే హాయిగా గుర్రుపెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఘటన విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. నడిరోడ్డుపై తాగుబోతు చేసిన పనితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతడిని ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్‌గా మార్చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లు తెలియకుండా ఫుల్‌గా మద్యం తాగిన అతడు..మందు మైకంలో నాకెవరు అడ్డు చెప్పేది.. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే, గుర్రుపెట్టి నిద్రపోయాడు. అటు, ఇటుగా ఎన్ని వాహనాలు రోడ్డుపై వెళ్తున్న అతని నిద్రకు మాత్రం భంగం కలగలేదు
వీడియో ఇక్కడ చూడండి..
Also read
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!





