గుంటూరులో అక్రమ మద్యం రవాణా కలకలం రేపింది. పైకి చూస్తే ఆ ట్రక్‌లో ఉన్నదంతా యాపిల్ పండ్లే.. కానీ తీరా పోలీసులు సాధారణ తనిఖీలు చేయగా.. అక్కడ కనిపించినవి చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అదేంటంటే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం రవాణా తీవ్ర కలకలాన్ని రేపింది. యాపిల్ పండ్ల వ్యాపారం మాటున పక్క రాష్ర్టాల మద్యం తరలింపు వ్యవహారం గుట్టురట్టు అయింది. మినీ లారీలో యాపిల్ పండ్ల చాటున పక్క రాష్ర్టాల మద్యం అమ్ముతూ ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు పట్టుబడ్డారు. మంగళగిరి మానస సరోవర్ వద్ద మాటు వేసి నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బొడ్డపాటి బాలక్రిష్ణ, ముండ్రు మస్తాన్ రావు, అనపర్తి ఏసోబు అని గుర్తించారు స్పెషల్ ఎక్సైజ్ పోలీసులు. చండీగఢ్ ,పంజాబ్ రాష్ర్టాల నుంచి గతంలో అనేకసార్లు మినీ లారీలో తెచ్చి అమ్మినట్లు ఉన్నతాధికారుల విచారణలో ఒప్పుకున్నారు ముఠా కీలక సూత్రధారులు.
Also Read
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!
- మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం!





