November 21, 2024
SGSTV NEWS
CrimeNational

Watch Video: ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. నలుగురిని అమాంతంగా మింగేసిన స్మశానవాటిక గోడ..!

గోడ ప్రక్కనే ఉన్న వీధిలో కొందరు వ్యక్తులు కుర్చీలపై కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో ఎవరూ ఊహించలేదు.. అకస్మాత్తుగా ఆ గోడ కూలిపోయింది. వాటిని శిధిలాల కిందే వారంతా సజీవ సమాధి అయ్యారు. గోడ కూలిన సమయంలో వారంతా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ..ఫలితం లేకపోయింది..అప్పటికే వారందరినీ ఆ గోడ కబళించేసింది.

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక శ్మశాన వాటిక గోడ కూలి నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌లో శనివారం సాయంత్రం శ్మశానవాటిక గోడ కూలి చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు మరణించిన విషాద సంఘటన చోటుచేసుకుంది. మదనపురిలోని శ్మశాన వాటిక వెనుక గేటు గోడ కూలిపోయినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ సంఘటనకు సంబంధించి సమీపంలో ఉన్న CCTV ఫుటేజీ బయటపడింది. ఫుటేజ్‌ ఆధారంగా .. గోడ ప్రక్కనే ఉన్న వీధిలో కొందరు వ్యక్తులు కుర్చీలపై కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో ఎవరూ ఊహించలేదు.. అకస్మాత్తుగా ఆ గోడ కూలిపోయింది. వాటిని శిధిలాల కిందే వారంతా సజీవ సమాధి అయ్యారు. గోడ కూలిన సమయంలో వారంతా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ..ఫలితం లేకపోయింది..అప్పటికే వారందరినీ ఆ గోడ కబళించేసింది. వెంటనే సమీపంలో ఉన్న కొందరు వ్యక్తులు వారికి సహాయం చేయడానికి పరుగెత్తారు. కానీ అప్పటికే దారుణం జరిగిపోయింది.  శ్మశానవాటిక గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పప్పు, కృష్ణ, మనోజ్, ఖుష్బూ అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్జున్ నగర్ పోలీస్ పోస్ట్ సమీపంలో సాయంత్రం 5:30- 6:00 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. ఇక్కడ శ్మశానవాటిక 18 అడుగుల ఎత్తైన గోడ ఊహించని విధంగా కూలిపోయింది.



గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఆ స్థలంలో ఉన్న అభీషర్, గోడ వెంబడి చెక్క సపోర్టులు ఏర్పాటు చేయడం వల్ల అది బలహీనపడిందని వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు గోడకు ఆనుకుని కూర్చోవడం, పిల్లలు సమీపంలో ఆడుకుంటున్న సమయంలో నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది.

Also read

Related posts

Share via