హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. మణికొండలోని పాషాకాలనీలో G+2 ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనమయ్యారు.. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని అగ్నిమాపకదళ అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.
హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. మణికొండలోని పాషాకాలనీలో G+2 ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనమయ్యారు.. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.. పాషాకాలనీలో ఉన్న G+2 ఇంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.. ఆ మంటలు వేగంగా ఫస్ట్‌ఫ్లోర్‌కి వ్యాపించాయి.. దట్టమైన పొగ.. మంటలతో.. ఇంట్లోనే బాధితులు చిక్కుకున్నారు.. ఊపిరాడక ముగ్గురు కూడా అక్కడే కుప్పకూలారు.. రెస్క్యూ చేసి కాపాడేలోపే ముగ్గురూ మృతి చెందినట్లు కాలనీ వాసులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం వెంటనే అక్కడికి చేరుకుంది.. సిబ్బంది మంటలను అదుపు చేయడంతోపాటు.. ఇంట్లో చిక్కుకున్న పలువురిని స్థానికుల సహాయంతో కాపాడారు. భవనం పైనుంచి తాళ్ల సహాయంతో పలువురిని రెస్క్యూ చేశారు.. అయితే.. భవనంలో షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు
Also read
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!
- మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం!





