రామచంద్రపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావని (14) నీటిలో దిగి గల్లంతవగా.. ఆమెను కాపాడేందుకు రంజిత్ (15), వీరేంద్ర (19) కూడా కాల్వలోకి దిగారు. ఈ క్రమంలో వారు కూడా గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!
- మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం!





