ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే క్రమంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వాన జల్లులు కురుస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు.
విషాదం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగులు పడి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం ప్రజలను వణికిస్తోంది
దీని కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్లు, హోర్డింగులు నేలకూలడంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక విజయవాడలో ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
చాలా రోజుల నుంచి ప్రజలు ఎండతీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఉక్క, చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాంటి సమయంలో రాష్ట్రంలో వర్షం పడటంతో కొంత ఉపశమనంగా మారింది. విజయవాడలోని చిట్టినగర్, పటమట, మొగల్రాజపురం, పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





