విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం పరిధిలో మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. లాకర్ పగలగొట్టి అందులోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
Also read
- కళ్లముందే కారులో మంటలు.. తండ్రి సజీవ దహనం! కుమారుడిని ఎలా కాపాడారంటే?
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!





