కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిలిపితీయా ఇంద్రజిత్ సింగ్ (28) ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఛాతీపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని కుడికుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు కాల్చుకున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





