భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో ఎస్ఐ బెదిరించి రూ.70 వేలు లంచం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. గురువారం లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేస్తున్నారు.
Also read
- కళ్లముందే కారులో మంటలు.. తండ్రి సజీవ దహనం! కుమారుడిని ఎలా కాపాడారంటే?
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!





