హైదరాబాద్: పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది మధురానగర్లోని భార్గవి లేడీస్ హాస్టల్ భవనం సైభాగంలో ఉన్న టెర్రస్లో నివసిస్తున్న హారిక (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టెర్రస్ పై ఉన్న బాత్రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మధురానగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హారిక మృతి చెంది రెండు రోజులు అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలి స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు. టెర్రస్ పై ఒంటరిగా నివసిస్తున్న హారిక బాత్రూంలో పడిపోయి మృతి చెందినట్టుగా అనుమానిస్తున్న పోలీసులు, అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





