నకరికల్లు: ఓ మహిళను అన్నదమ్ములిద్దరూ బెదిరించి వీడియోలు తీస్తూ అత్యాచారానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి గ్రామీణ సీఐ కిరణ్ కథనం ప్రకారం.. నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్‌తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మాట్లాడాలని సుధాకర్ ఫోన్ చేయడంతో గ్రామ శివారుకు మహిళ వచ్చింది. అప్పటికే మద్యం తాగి ఉన్న సుధాకర్, అతడి సోదరుడు శ్రీను ఆమెను కట్టేసి వీడియోలు తీస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోగా., అక్కడకి సుధాకర్ వచ్చి మరోసారి అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేయడంతో నకరికల్లు పోలీసులు చేరుకుని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. సుధాకర్ సచివాలయ ఉద్యోగి. విధుల్లో పలు ఆరోపణలు రావడంతో సస్పెన్షన్‌లో ఉన్నాడు. ఇప్పటికే ముగ్గురు యువతుల్ని ప్రేమ, పెళ్లి పేరిట మోసగించినట్లు అతడిపై కేసులు ఉన్నాయి.
Also read
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య
- ఠాణాలో భార్యపై కత్తితో దాడి
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!





