మూసాపేట (హైదరాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడో కిరాతక భర్త. అనంతరం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్మరా బేగం (24), షేక్ రహీంలకు 2024లో వివాహం జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ కుటుంబంతో కలిసి కైతలాపూర్ లోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. రహీం ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా.. ఆస్మరా బేగం ఇంట్లోనే ఉంటోంది. కాగా వివాహం జరిగినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో దంపతులిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రహీం కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
Also read
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం
- సోషల్ మీడియా లో పరిచయం.. మాయమాటలతో వల
- చున్నీతో చేతులు కట్టేసి.. నోట్లో రుమాలు కుక్కి..





