వైసీపీ నాయకుడు ఒకరు వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన సంఘటన విజయవాడ నడిబొడ్డున జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సన్నిహితుడుగా పేరు పొందిన శంకర నాయక్ అనే వైసీపీ నాయకుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం రాజకీయ వర్గాలలో సంచలనం గా మారింది. వైసీపీ నాయకుడు శంకర నాయక్ విజయవాడలో మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జగన్ రెడ్డి సీఎంగా పని చేసినప్పుడు శంకర్ నాయక్ ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. గతంలో ఇలా జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పదవులు పొందిన చాలా మంది వ్యభిచారం చేస్తూ ఇతర నేరాల్లో పట్టబడ్డారు. తాజాగా శంకర్ నాయక్ ఇలా వ్యభిచారం కేసులో పట్టుపడటంతో ఇదా రాజకీయం అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకుల పేరుతో సంఘ విద్రోహశక్తులు చేస్తున్న ఇలాంటి నేరాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. శంకర నాయక్ స్పా సెంటర్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తాజా ఉదాహరణగా చెబుతున్నారు. విజయవాడలో మసాజ్ సెంటర్ లో ఉత్తరాది యువతితో వ్యభిచారం చేస్తున్న సమయంలో పోలీసులు రావడంతో అత్యంత రహస్య ప్రదేశంలో దాక్కున్న వైసీపీ నాయకుడు శంకర్ ను అతి కష్టం మీద పోలీసులు పట్టుకున్నారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!