కుటుంబ కలహాలో, హత్య కేసులో, లేదా భూ వివాధాలో ఇలా ఏదో ఒక వివాదంలో కోర్టు నుంచి నోటీసులు రావడం కామన్. ఇక్కడో మహిళకు మాత్రం తన ఫ్రెండ్ను గాజుల పండుగకు పిలవలేదని నోటీసు వచ్చింది. స్థానిక జనాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిన ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు మహిళా సంఘం ఆధ్వర్యంలో స్నేహితులకు గాజులు వేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ప్రతి రోజు కలిసే స్నేహితులు స్థానికంగా ఉండే మహిళలను పిలిచి వారందూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన కోంపల్లి అనిత అనే మహిళను ఈ కార్యక్రమానికి పిలవడం మిగతా స్నేహితులు మర్చిపోయారు. దీంతో తీవ్ర అసంతృప్తికి చెందిన అనిత తనను ఎందుకు పిలువలేదో చెప్పాలని కోర్టును అశ్రాయించారు. ఆమె పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ ప్రతివాదులకు నోటీసులు కూడా జారి చేసింది.
తాను మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, గత కొన్నీ సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్నానని.. కానీ సంఘం వాళ్లు మాత్రం గాజుల పండగ కార్యక్రమానికి తనను పిలవలేదని ఆమె పేర్కొంది. తనను ఎందుకు పిలవలేదో, తనను పిలవకపోవటానికి కారణం ఏంటో సంఘ సభ్యులు చెప్పాల్సిందిగా నోటిసులు పంపింఛానని కోర్టును కోరింది. దీంతో కోర్టు సంఘ సభ్యులు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు చూసిన సంఘం సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే సంఘం సభ్యుల వాదన మరోలా ఉంది. స్నేహితులందరం కలిసి గాజుల పండగ చేసుకున్నామని, ఈ కార్యక్రమానికి అనితను పిలిచినా.. పిలవలేదని నోటీసులు పంపించడం ఏంటని వారు అంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి కాని.. ఇలా నోటీసులు పంపించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు
Also read
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!





